రైళ్లల్లో విమాన టాయిలెట్లు..ముక్కు మూసుకోవడం తప్పినట్లే ! - MicTv.in - Telugu News
mictv telugu

రైళ్లల్లో విమాన టాయిలెట్లు..ముక్కు మూసుకోవడం తప్పినట్లే !

February 23, 2018

రైల్వే ప్రయాణం చేసే ప్రయాణికులు  మరుగుదొడ్లకు వెళ్లాలంటే ముక్కులకు గుడ్డ కట్టుకుని ఆ కంపును భరించాల్సిందే .కానీ ఇక నుంచి ఆ పరిస్థితి ఉండదు. కేంద్ర ప్రభుత్వం ఆధునాతన మరుగుదొడ్లను రైల్వే కోచుల్లో ఏర్పాటు చేయనుంది.విమానాల్లో ఉండే మరుగదొడ్ల మాదిరిగానే త్వరలో రైళ్లలోను ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి షీయూష్ గోయల్ తెలిపారు. ఈ మేరకు 500 కోచ్ ల్లో (వ్యాక్యూమ్ టాయిలెట్లు)ను ప్రయోగత్మకంగా అమర్చారు. ఈ విధానం విజయవంతమైతే అన్ని రైళ్లలో ఏర్పాటు చేస్తారు.

రైల్వే విక్రేతల కోసం రూపొందించిన ప్రత్యేక యూప్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన గురువారం దిల్లీలో మాట్లాడారు. అశ్వనీ లోహనీ రైల్వేబోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం విమానాల తరహా మరుగుదొడ్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. జీవ మరుగుదొడ్లతో దుర్గంధం, మరికొన్ని సమస్యలు ఎదురవుతుండటంతో సాంకేతిక నిపుణుల సూచనల మేరకు మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విమాన తరహా మరుగుదొడ్లలో అమర్చే ప్రత్యేక పంపు వల్ల నీటి వినియోగం కూడా తగ్గుతుంది.