రెమ్యునరేషన్‌గా 4 కోట్ల విల్లా!

షార్ట్ ఫిలింస్ తీస్తూ,  ‘ఉయ్యాల జంపాల’ అనే సినిమాతో  సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు రాజ్ తరుణ్. వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిన రాజ్ తరుణ్‌కు ఓ బంపర్ గిఫ్ట్ ఇచ్చారు నిర్మాతలు.  ప్రస్తుతం ‘రాజుగాడు యమా డేంజర్’ అనే సినిమాలో నటిస్తున్న  రాజ్ తరుణ్  ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లో నాలుగు సినిమాలు చేయడానికి అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడట. అయితే ఈ నాలుగు సినిమాలకు గాను రెమ్యూనరేషన్‌ కింద రాజ్ తరుణ్‌కు ఓ ఖరీదైన విల్లాను రాసిచ్చారట నిర్మాతలు. దిల్ రాజు అల్లుడు నిర్మిస్తున్న ఈ విల్లా ఖరీదు దాదాపు మూడున్నర నుంచి నాలుగు కోట్ల రూపాయల వరకు ఉంటుందట. మొత్తానికి చిన్న చిన్న షార్ట్ ఫిలింస్ చేస్తూ కష్టపడి ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ కుర్ర హీరో.

SHARE