రాజమౌళికి ‘అర్జున్ రెడ్డి’  బాగా నచ్చేశాడు - MicTv.in - Telugu News
mictv telugu

రాజమౌళికి ‘అర్జున్ రెడ్డి’  బాగా నచ్చేశాడు

December 12, 2017

దర్శకుడు రాజమౌళి  తన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా  ఏదైనా సినిమాకు మంచి టాక్  వచ్చిందంటే  తప్పకుండా వెళ్లి ఆ సినిమా చూస్తాడు. ఎందుకంటే  సినిమాలు తీయడమే కాదు..సినిమాలు చూడడమన్నా రాజమౌళికి  ఎంతో ఇష్టం. సినిమా చూసిన తర్వాత ఆసినిమా ద్వారా పొందిన  అనుభూతులను అభిమానులతో పంచుకుంటుంటారు.

అయితే ఈయాడాదిలో రాజమౌళికి అన్ని సినిమాలకంటే  ‘అర్జున్ రెడ్డి’ సినిమా  చాలా నచ్చిందట. ఈసినిమాలో విజయ్ దేవరకొండ, హీరోయిన్  షాలిని అద్భుతంగా నటించారని  ఆయన కితాబునిచ్చారు. గతంలో సంపూర్ణేశ్ బాబు నటించిన  ‘హృదయకాలేయం’  ట్రైలర్ ను చూసిన రాజమౌళి  తన ట్విట్టర్లో  ఆ సినిమా గురించి చెప్పడంతో  ఆసినిమాకు  ఎక్కడాలేని  హైప్ వచ్చిన సంగతి తెలిసిందే.

భారీ బడ్జెట్‌తో సినిమాలు తీయడమే కాదు, మంచి కంటెంట్‌తో వచ్చే చిన్న సినిమాలను  కూడా రాజమౌళి ఎంకరేజ్ చేస్తాడన్న విషయంలో ఎటువంటి సందేహంలేదు.