రాజా ది గ్రేట్‌కు ఫోన్ టార్చర్ - MicTv.in - Telugu News
mictv telugu

రాజా ది గ్రేట్‌కు ఫోన్ టార్చర్

October 23, 2017

ఫోన్ నంబర్లను సినిమాల్లో గానీ, కథల్లో గానీ వాడటం వల్ల ఆ నంబరు ఎవరికైనా వుందంటే ఇక వారికి తీవ్ర ఇబ్బందులే. అప్పటికప్పుడు తోచిన నంబరుని సినిమాల్లో, కథల్లో వాడుతుంటారు. కానీ ఆ నంబరును ఒకరు వాడితే ఎలా వుంటుంది. చాలా మంది నుంచి అతనికి ఫోన్ల మోత మొదలవుతుంది. తాజాగా రవితేజ నటించిన ‘ రాజా ది గ్రేట్ ’ సినిమాలో 80745…22 అనే నంబరును వాడారు. ఆ నంబరును విశాఖలో ఫలానా లంకలపల్లి గోపి వాడుతున్నాడు. ఆ విషయం ఈ సినిమా టీమ్‌కు తెలియదు. రాజా ది గ్రేట్ సినిమా చూసినవాళ్ళంతా వరుసగా ఆ నంబరుకి కాల్ చేసి ‘రవితేజా గారా మాట్లాడేది.. సూపర్ మీ యాక్టింగ్.. ’ అంటూ తీరిక లేకుండా ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారట. పాపం గోపీ ఈ ఫోన్ చిత్రవధక తాళలేకపోతున్నాడు. పనులు మానుకొని ఫోన్ చేసిన ప్రతీ ఆకాశ రామన్నతో.. ‘అయ్యా.. బాబూ.. నేను రవితేజను కాను విశాఖలోని లంకలపల్లి  గోపీని ’ అని మొత్తుకుంటున్నడట.  

సినిమాలో రవితేజ ఈ నంబర్ వాడాడని.. అది అతని పర్సనల్ నంబరేమో అనుకొని పాపం మాస్ మహారాజా ఫ్యాన్స్ అనుకున్నట్టున్నారు. డైరెక్టుగా రవితేజాతో మాట్లాడొచ్చని చీటికీ మాటికీ కాల్స్ చేసి గోపీని విసిగించడమే పనిగా పెట్టుకున్నట్టున్నారు.. పాపం గోపి ‘ నా నంబరును ఎందుకు సినిమాలో వాడార్రా నాయనా.. ’ అని బాధ పడుతున్నాడు గోపీ.  అయినా సినిమాల్లో ఇలా నంబర్లు వాడేటప్పుడు కొత్త సిమ్ కార్డు తీసుకుని వాడితే బాగుంటుంది కదా అని సలహా ఇస్తున్నారు ఈ విషయం తెల్సినవాళ్ళు.