జీవిత-రాజశేఖర్ ఇంట్లో మరో విషాదం - MicTv.in - Telugu News
mictv telugu

జీవిత-రాజశేఖర్ ఇంట్లో మరో విషాదం

November 2, 2017

ఈమధ్యే  హీరో రాజశేఖర్ తల్లి మరణించిన విషయం అందరికి తెలిసిందే.  అయితే ఈరోజు రాజశేఖర్ ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. రాజశేఖర్ బావమరిది మురళి శ్రీనివాస్  బుధవారం అర్ధరాత్రి మరణించారు. మురళి శ్రీనివాస్ జీవితకు స్వయాన అన్న అవుతాడు. మురళి తీవ్ర అనారోగ్యంతో వారంరోజుల నుంచి వెంటిలేటర్‌పైనే ఉన్నారు.  

ఓ వైపు బావమరిది బాగోగులు చూసుకుంటూనే, మరోవైపు శుక్రవారం విడుదల కానున్న  ‘పిఎస్ వి గరుడవేగ’  సినిమా ప్రమోషన్లలో రాజశేఖర్ పాల్గొన్నారు. ఇంతలోనే ఈవిషాదం చోటుచేసుకుంది. మరి ఇలాంటి సమయంలో  రాజశేఖర్ తన సినిమా విడుదలను వాయిదా వేస్తాడో, లేక ఇతర సమస్యలను దృష్టిలో పెట్టుకుని సినిమాను అనుకున్న  రోజుకే  విడుదల చేస్తారో చూడాలె మరి.