‘నేనే రాజు..’ను నేను చేయాల్సింది.. కానీ.. - MicTv.in - Telugu News
mictv telugu

‘నేనే రాజు..’ను నేను చేయాల్సింది.. కానీ..

October 30, 2017

తేజ దర్శకత్వంలో రాణా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా, మొదట హీరో రాజశేఖర్ దగ్గరకే వెళ్లింది. అయితే కథ క్లైమాక్స్‌లో దర్శకుడు తేజకు, రాజశేఖర్‌కు మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో, తేజ రాణాను సంప్రదించారు.

ఈ విషయాన్ని స్పయంగా రాజశేఖర్ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పాడు. ‘సినిమా ఇండస్ట్రీలో తేజ నాకు ఎప్పటినుంచో తెలుసు, డైరెక్టర్‌గా ట్రై చేయమని తేజను బలంవంతం చేసింది కూడా నేనే. ఆ చనువు వల్లే  క్లైమాక్స్ అలా ఉంటే చేయనని నేను కచ్చితంగా చెప్పాను, దీంతో తను భల్లాలదేవుడు దగ్గరికి వెళ్లిపోయాడు’ అని రాజశేఖర్ అన్నాడు. ప్రస్తుతం రాజశేఖర్‌ కొత్త సినిమా ’పీఎస్‌వీ గరుడవేగ’  నవంబర్‌ 3న విడుదలకు సిద్ధంగా ఉంది.