చంద్రబాబు పాత్రలో జగపతిబాబు - MicTv.in - Telugu News
mictv telugu

చంద్రబాబు పాత్రలో జగపతిబాబు

October 30, 2017

ఎన్టీఆర్ జీవిత ఆధారంగా తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’. ఈ చిత్రంలో బాలకృష్ణ  ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్నారు.  ఎన్టీఆర్ కుమారుల పాత్రలు కూడా ఉండబోతున్నాయని సమాచారం.

ఆయన కుమారుడు హరికృష్ట పాత్రలో హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్ నటిస్తుండగా, ఎన్టీఆర్ అల్లుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రలో జగపతి బాబు‌ను చిత్ర యూనిట్ ఎంపిక చేసుకుందని సమాచారం.  ఈ చిత్రంలో ఎన్టీఆర్ నిజ జీవితంలో ఉన్న చాలా మంది ప్రముఖుల పాత్రల్లో భారీ  తారాగణమంతా కనిపించడం ఖాయమని తెలుస్తోంది. అలాగే  జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో చూపించాలనేది తేజ ప్రణాళికగా తెలుస్తోంది.