తండ్రి హింసకు తాళలేక టెర్రస్‌పై నుంచి దూకిన కుమార్తె - MicTv.in - Telugu News
mictv telugu

తండ్రి హింసకు తాళలేక టెర్రస్‌పై నుంచి దూకిన కుమార్తె

April 16, 2018

కొందరు పిల్లలను ఎందుకు కంటారో తెలియదు. కన్నబిడ్డ అని కూడా చూడకుండా చిత్ర హింసలు పెడుతుంటారు. అల్లారు ముందుగా చూసుకోవాల్సిన పసిపాపల మనస్సును, శరీరాన్ని గాయాల పాలు చేస్తారు. అలాంటి సంఘటనే రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. తండ్రి పెడుతున్న హింసను తట్టుకోలేక 12 సంవత్సరాల బాలిక టెర్రెస్ పై నుంచి  దూకింది. సంతోష్ అనే వ్యక్తి తన కూతురు వందనను చెప్పుతో పదే పదే కొడుతుంటే ఆ బాధ నుంచి తప్పించుకునేందకు ఆమె టెర్రెస్‌పై నుంచి దూకింది. వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.

ఈ మొత్తం ఘటనను ఎవరో వీడియో తీసి అందించగా, కేసు నమోదు చేసిన పోలీసులు, సంతోష్‌ను అరెస్ట్ చేశారు. కుమార్తెను హింసించిన నేరానికి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కూతురును అంత అమానవీయంగా కొడుతున్న తండ్రిని చాలామంది రాక్షస తండ్రి అని కామెంట్లు చేస్తున్నారు.