రాజకీయ నేతలకు ఆరునెలలు ఖుషీ! - MicTv.in - Telugu News
mictv telugu

రాజకీయ నేతలకు ఆరునెలలు ఖుషీ!

October 21, 2017

రాజస్థాన్ ముఖ్యమంత్రి  వసుంధరా రాజే,.. జడ్జిలకు, ప్రజాప్రతినిధులకు అండగా ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు. అవినీతి, లైంగిక వేధింపులు తదితర నేరారోపణలు ఎదుర్కొంటున్న  ప్రజా ప్రతినిధులు, న్యాయమూర్తులకు  ఇది రక్షణ  రకకల్పిస్తుంది. సంబంధిత ఆర్డినెన్స్ సర్కారు ఈ కొత్త చట్టంగా మార్చింది.  దీని కింద వారిని 180 రోజుల వరకు  విచారించే హక్కు ఎవరికీ ఉండదు.

‘అవినీతితో పాటు వివిధ కేసుల్లో ఆరోపణలను ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు (మాజీ  న్యాయమూర్తులు)  ప్రజాప్రతినిధులపై అభియోగాలు నమోదైనప్పుడు న్యాయమూర్తి‌తో సహా ఎవరూ వారిని విచారణకు ఆదేశించే హక్కు లేదు. వారికి విచారణ నుంచి  6 నెలల ఉపశమనం ఉంటుంది’ చట్టంలో పేర్కొన్నారు. అదే సమయంలో ఆయా అధికారులు, ప్రజాప్రతినిధులు పేర్లు ప్రస్తావిస్తూ ఏ  విధమైన  కథనాలను ప్రచురించటానికి  వీలులేదని మీడియాపై ఆంక్షలను విధించారు. . ఏవరైనా చట్టాన్ని అతిక్రమించి వార్తా కథనాలు ప్రచురిస్తే వారిపై కఠిన చర్యలతో పాటు జైలు శిక్ష తప్పదని  అని ప్రభుత్వం హెచ్చరింది.

నేరస్తులకు ఊరటనిచ్చే ఈ చట్టంపై  ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. 6 నెలల్లో కేసును తప్పు దోవ పట్టించే అవకాశం ఉంటుందని , అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయనాయకులకు, అధికారులకు లాభం చేకూర్చేలా చట్టం చేయడం మంచిది కాదని విమర్శిస్తున్నాయి.