భక్తి పాటలు వింటూ అధిక పాలు ఇస్తున్న ఆవులు - MicTv.in - Telugu News
mictv telugu

భక్తి పాటలు వింటూ అధిక పాలు ఇస్తున్న ఆవులు

March 26, 2018

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’  సినిమాలో హీరో సిద్దార్థ్ ఆవులకు  హెడ్‌ఫోన్స్ పెట్టి పాలు పితకడం చూశాం కదా? అలానే  రాజస్థాన్‌లోని సీకర్ జిల్లాలోని నీమ్ కాథాన్‌‌లో ఒక ప్రత్యేకమైన గోశాల ఉంది. అక్కడ  ప్రతిరోజు ఉదయం,సాయంత్రం సమయంలో గోవులకు భక్తి గీతాలను వినిపిస్తారు. అవి కూడా పాటలు వినంది పాలు ఇవ్వనంత మొండికేస్తున్నాయంట.ఈ గోశాలలో మొత్తం 600 గోవులు ఉన్నాయి. ఈ విధంగా ప్రతిరోజు గోవులకు  భక్తి పాటలను వినిపించడం వల్ల పాల ఉత్పత్తి 20 నుంచి 25 శాతం పెరిగిందని గోశాల నిర్వహకులు తెలిపారు. రెండు దశాబ్ధాలుగా గో సంరక్షణ సేవలు అందిస్తున్న ఈ గోశాలలో ప్రస్తుతం 22 మంది పనిచేస్తున్నారు. ఈ గోశాలలో పాల విక్రయం ద్వారా ప్రతీరోజూ సుమారు రెండు లక్షల రూపాయల ఆదాయం సమకూరుతోంది. ప్రస్తుత వేసవిలో గోశాలలో చల్లదనం కోసం కూలర్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు.