ఈ రైల్వేస్టేషన్‌లో మొత్తం మహిళా ఉద్యోగులే... - MicTv.in - Telugu News
mictv telugu

ఈ రైల్వేస్టేషన్‌లో మొత్తం మహిళా ఉద్యోగులే…

February 26, 2018

రాజస్థాన్‌లోని గాంధీనగర్ రైల్వేస్టేషన్‌ పూర్తిగా మహిళ సిబ్బందితో నడుస్తోంది. ముంబైలోని మతుంగ రైల్వే స్టేషన్ తర్వాత పూర్తిగా మహిళా సిబ్బందితో పని చేస్తున్న రెండో రైల్వేస్టేషన్‌గా గాంధీనగర్  ప్రత్యేకంగా నలిచింది. ఈ రైల్వేస్టేషన్‌లో మొత్తం 40 మంది మహిళా సిబ్బంది ఆపరేటింగ్ విధులతో పాటుగా స్టేషన్‌లోని కీలక విధులను నిర్వహిస్తున్నారు.

ఈ రైల్వేస్టేషన్ జైపూర్ ఢిల్లీ మార్గంలో ఉంది. ప్రతిరోజు ఈ రైలు మార్గం ద్వారా  50 రైళ్ళు ప్రయాణిస్తుంటాయి. రోజుకు  సూమారు 7వేల మంది ప్రయాణీకులు ఈ రైల్వేస్టేషన్ ద్వారా రాకపోకలు చేస్తుంటారు. మహిళలంతా షిప్టుల వారీగా రాత్రులు కూడా టికెట్ బుకింగ్, రద్దు చేయడం వంటి విధులను నిర్వహిస్తున్నారు.