ఆరోగ్య మంత్రి.. రోడ్డుపైనే పనికానిచ్చేశాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆరోగ్య మంత్రి.. రోడ్డుపైనే పనికానిచ్చేశాడు..

February 15, 2018

రాజస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి కాశీచరణ్ షరాఫ్‌పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. స్వచ్ఛభారత్, పరిశుభ్రత అంటూ ఊదరగొట్టే  ఆయన అందరూ చూస్తుండగానే  రోడ్డుపైనే మూత్రం పోశారు. పింక్ సిటీగా పేరున్న పర్యాటక నగరం  జైపూర్‌‌లోనే  గోడను తడిపేశాడు. దాంతో విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకునే మంత్రివర్యులే  ఇలాంటి పనులు చేయడం ఎంతవరకు సమజసం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జైపూర్ లో చాలా మూత్రశాలలు ఉన్నాయని, అయితే ఆయన వాటి వద్దకు ఎందుకు పోలేదని ప్రశ్నిస్తున్నాయి.ఓ వైపు స్వచ్చ భారత్ అభియాన్ పథకం కింద జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్చత విషయంలో దేశంలోనే మొదటిస్థానంలో ఉండేందుకు సర్కారు కృషి చేస్తుంటే .. బాధ్యత గల పదవిలో ఉన్న మంత్రి ఇలాంటి పని చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ ఆగ్రహాం వ్యక్తం చేస్తుంది. బీజేపీ ప్రవేశపెట్టిన పథకాలను ఆ పార్టే మంత్రులే నీరుగారుస్తున్నారని కాంగ్రేస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. జైపూర్‌లో రోడ్డు పక్కల ఎవరైనా మూత్రం పోస్తే రూ. 200 జరిమానా కూడా విధిస్తున్నారు.