ఇది ఉల్టా లవ్ జీహాద్  - MicTv.in - Telugu News
mictv telugu

ఇది ఉల్టా లవ్ జీహాద్ 

November 30, 2017

 ముస్లిం యువకులు, హిందూ  యువతులు ప్రేమించుకుంటే.. ఆ యువతులు ముస్లిం మతంలోకి మారి  మరీ వివాహం చేసుకుంటున్నారు. కానీ రాజస్థాన్‌లో ఇలాంటి లవ్ జీహద్ కాస్త వికటించింది. తను వలచిన ముస్లిం  అబ్బాయి హిందూ మతంలోకి మారితే వివాహం చేసుకుంటానని  పూజా జోషి అనే హిందూ యువతి కుండబద్దలు కొట్టిపారేస్తోంది. అయితే  ప్రియుడు మోహిసన్ ఖాన్ అందుకు ససేమిరా అంటున్నాడు.ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్న మోహిసన్ ఖాన్ 20 ఏళ్ల పూజా జోషిని ప్రేమించాడు. అతని ప్రేమను పూజ కూడా అంగీకరించింది. ఈ నెల 28న ఇద్దరూ ఇళ్ల నుంచి పారిపోయారు పెళ్లడ్డానికి.  అయితే  పూజ కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు జోధ్‌పూర్ పోలీసు స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టారు. ప్రేమికులిద్దరినీ పోలీసులు బికినీర్‌లో అదుపులోకి తీసుకుని  స్టేషన్‌కు తరలించారు. ఇద్దరినీ పోలీసులు విచారిస్తున్న సమయంలోనే ఈ ఉల్టా లవ్ జీహద్ గురించి పట్టణమంతా తెలిసిపోయింది.  దాంతో భారీగా హిందూవులు పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు.

స్టేషన్ బయట ఈ వివాదం జరుగుతున్న సమయంలోనే మోహిసన్ ఖాన్ హిందూమతంలోకి మారితేనే పెళ్లి చేసుకుంటానని పూజా పోలీసులకు తెగేసి చెప్పింది.  మోహిసన్ మతం మారేదాక ఎదరుచూస్తానని, లేదంటే వేరే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.