మనసున్న మామ..కోడలికి రెండో కొడుకుతో పెళ్లి - MicTv.in - Telugu News
mictv telugu

మనసున్న మామ..కోడలికి రెండో కొడుకుతో పెళ్లి

December 11, 2017

అప్పడప్పడు కొన్ని సంఘటనలను చూస్తుంటే మనుషుల్లో  ఇంకా మానవత్వం ఉందా అనిపిస్తుంది. అలాంటి ఓ ఘటనే మధ్యప్రదేశ్‌లోని నాగ్దాలో జరిగింది. ఓ మనసున్న మావయ్య.. తన కోడలి జీవితాన్ని కాపాడ్డానికి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పెద్ద కొడుకు రోడ్డుప్రమాదంతో చనిపోవడంతో వితంతువుగా మారిన కోడలిని.. బాగా చదివించడమే కాకుండా తన రెండో కొడుకుతో పెళ్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాడు.వివరాల్లోకి వెళ్లే.. నాగదా పట్టణానికి చెందిన రాజేంద్ర చౌదరి ట్రాన్స్ పోర్టు కంపెనీలో పని చేస్తున్నాడు. 2012లో పెద్ద కొడుకు సుమిత్‌కు గాయత్రి అనే యువతితో పెళ్లి జరిపించాడు. 2014లో సుమిత్ రోడ్డు  ప్రమాదంలో చనిపోయాడు. దాంతో గాయత్రి, ఆమె ఏడు నెలల కుమార్తె భవిష్యత్ అంధకారంలో పడింది. అయితే రాజేంద్ర ధైర్యం చిక్కబట్టుకున్నాడు. గాయత్రిని గాలికి వదిలేయకుండా.. ఓ కాలేజీలో చేర్పించాడు. చక్కగా చూసుకుంటూ ఆత్మస్థయిర్యాన్ని నూరిపోశాడు. గాయత్రి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమె జీవితం మోడువారిపోకుండా ఉండగానికి రాజేంద్ర మరో నిర్ణయం తీసుకున్నాడు.  తన చిన్న కొడుకు హితేశ్‌తో గాయత్రికి వివాహం చేయాలని నిర్ణయించాడు. దీనికి హితేశ్ కూడా అంగీకరించాడు.