50 తులాల బంగారం పోతే… 62 తులాలు ఇచ్చారు ! - MicTv.in - Telugu News
mictv telugu

50 తులాల బంగారం పోతే… 62 తులాలు ఇచ్చారు !

February 9, 2018

మనం చాలా కేసులు చూస్తుంటాం. నగలు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేస్తే  యాభై శాతం ఆ దొంగలు దొరికే అవకాశమే లేదు. ఒకవేళ దొరికినా కూడా పోయిన బంగారం పూర్తిగా తిరిగొస్తుందనే గ్యారంటీ లేదు. అయితే  హైదరాబాద్ లో ఓ వింత సంఘటన జరిగింది. నగలు పోయాయని కంప్లైంట్ ఇస్తే  పోలీసులు పోయిన నగలకంటే  12 తులాల నగలను  ఎక్కువనే ఇచ్చారు.రాజేంద్రనగర్‌లో నివాసం ఉంటే మహ్మద్ ఇమ్రాన్ ఖాన్  అనే వ్యక్తి ఇంట్లో ఫిబ్రవరి 5న దొంగలు పడ్డారు. దొంగలు ఇంట్లోని బంగారం  మొత్తం ఎత్తుకెళ్లారని, వాటి బరువు 50 తులాలని  ఇమ్రాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అబ్ధుల్ జహీర్ అనే  వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తనే దొంగతనం చేసినట్లు అతను అంగీకరించాడు. అయితే అతని దగ్గర నుంచి మొత్తం బంగారంను తూకం వేయగా 62 తులాలు అని తేలింది.  ఇంట్లో దొంగతనం జరిగిన ఇమ్రాన్‌‌ను పిలిపించగా ఆ నగలను పరిశీలించి..  ‘ఈ నగలన్నీ మావే …కంగారులో  నగలు ఎన్ని తులాలు ఉన్నాయో కచ్చితంగా చెప్పలేక పోయాం..’ అని పోలీసులకు చెప్పాడు. దీనితో ఆ మొత్తం నగలను  వాారికి  అప్పగించారు పోలీసులు.  పోయిన నగలను  దొర్కబట్టి  నిజాయితీగా బాధితులకు అప్పగించిన రాజేంద్రనగర్ పోలీసులకు రివార్డులు ఇచ్చేందుకు  ఉన్నతాధికారులు  ఆలోచిస్తున్నారట.