జీవితే.. రాజశేఖర్‌కు అమ్మాయిలను పంపుతుంది.. - MicTv.in - Telugu News
mictv telugu

జీవితే.. రాజశేఖర్‌కు అమ్మాయిలను పంపుతుంది..

April 16, 2018

కాస్టింగ్ కౌచ్ గురించి పెద్ద చర్చే జరుగుతోంది. ఇందుకు శ్రీరెడ్డి ఊతమివ్వటంతో చాలా మంది అమ్మాయిలు బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయాలను ఏకరువు పెడుతున్నారు. ఈ క్రమంలో ప్రెస్‌క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో సినీ ఫీల్డుకు సంబంధించిన అమ్మాయిలు మాట్లాడారు. ‘సినిమా ఫీల్డులోని అమ్మాయిలను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని చెప్పిన జీవితా రాజశేఖర్ కూడా అలాంటిదే.

అమ్మాయిలను ఆమే స్వయంగా రాజశేఖర్ పక్కలోకి పంపిస్తుంది. మేం సినిమాల్లో బిచ్చపుదాని పాత్ర ఇచ్చినా చేద్దామని వస్తాం. కానీ వాళ్ళు ఆ క్యారెక్టర్ కూడా ఇవ్వకుండా మమ్మల్ని లైంగికంగా వేధిస్తున్నారు. అమ్మానాన్నలను ఎదురించి వచ్చి మేమిక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో.. దానికి భిన్నంగా వీళ్ళు మాకు పెడుతున్న లైంగిక ఇబ్బందులు మమ్మల్ని మానసికంగా చంపేస్తున్నాయి ’ అని కంటనీరు పెట్టుకుంది బాధిత మహిళ.

తెర మీద చూపించేవి నీతులు.. తెర వెనుక పాటించే నీఛాలకు ప్రక్షాళన జరగాలని వారంతా కోరుతున్నారు. పవన్ కల్యణ్ మా ఎదురుగా వచ్చి స్పందించాలన్నారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వచ్చి మా బాధలను అర్థం చేసుకుని మాకు సరైన మార్గం చూపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవి, సంధ్య, కొండవీటి సత్యవతిలు, అపూర్వలు పాల్గొన్నారు.