కాలా.. గొడవపడైనా కాపాడతాడు.. టీజర్ వచ్చేసింది - MicTv.in - Telugu News
mictv telugu

కాలా.. గొడవపడైనా కాపాడతాడు.. టీజర్ వచ్చేసింది

March 2, 2018

‘కాలా అంటే ఎవరు.. కాలుడు కరికాలుడు. గొడవపడైనా సరే కాపాడేవాడు..’ అంటూ రజినీ ఇంట్రడక్షన్ చాలా పవర్ ఫుల్‌‌గా వుంది . ‘ నలుపు.. శ్రమజీవుల వర్ణం.. మా వాడకొచ్చి చూడు.. మురికంతా ఇంద్రధనుస్సులా కనిపిస్తుంది ’ . ‘ కాలా అంటే నలుపు..చావుకే దేవుడు ’, ‘ క్యారే.. షట్టింగా ’ అనే డైలాగ్స్‌‌తో ‘ కాలా ’ టీజర్ వచ్చింది. ముంబై నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రజనీ మాఫియా డాన్‌ కరికాలన్ పాత్రలో నటిస్తున్నాడు. రజనీకి ‘ కబాలి ’ వంటి హిట్టిచ్చిన పా. రంజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.


వండ‌ర్ బార్ ఫిలింస్ ప‌తాకంపై ధ‌నుష్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 27న విడుద‌ల కానుంది. ర‌జ‌నీకాంత్ 164వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో రజనీకాంత్ భార్యగా సీనియర్ నటి ఈశ్వరీ రావ్, కొడుకు పాత్రలో దిలీపన్ నటిస్తున్నాడు. నానా పాటేకర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలబడనున్నాడు. బాలీవుడ్ బ్యూటీలు హ్యూమా ఖురేషి, అంజలి పాటిల్ ముఖ్య పాత్రల్లో మెరుస్తున్నారు.  ఏప్రిల్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘ 2.0 ’ ఏప్రిల్ 28 న విడుదల అవుతుందని ప్రకటించారు. కారణాలేంటో తెలియదు గానీ ఆ చిత్రం విడుదల వాయిదా పడింది. ‘ కాలా ’ తరువాతే ‘ 2.0 ’ సినిమా విడుదల అవటం విశేషం.