రజనీ 2.0 మరో లుక్ - MicTv.in - Telugu News
mictv telugu

రజనీ 2.0 మరో లుక్

October 26, 2017

సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడుగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘2.0’. ఈ చిత్రంలో రజినీ మరోసారి రోబోగా దర్శనమివ్వనున్నాడు.

ఈ చిత్రానికి సంబందించిన రోజుకో పోస్టర్‌తో  సినిమా మీద భారీ హైప్ పెంచుతున్నాడు శంకర్. రజినీ‌ మరో లుక్‌ను బయటపెడుతూ చేస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది యూనిట్.రజినీ కాలు మీద కాలు వేసుకోని చాలా స్టైలిష్‌గా ఉన్నాడు.  ఈ చిత్రంలో ఎమ్మీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రతినాయకుడిగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్ సంస్థ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది. ఈ శుక్రవారం ఆడియో కార్యక్రమం దుబాయ్‌లో జరగనుంది. దుబాయ్ రాజు సల్మాన్  హాజరు అయ్యే అవకాశం ఉందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ కార్యక్రమానికి శంకర్.. కమల్ హసన్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు సమాచారం.