mictv telugu

అభిమానం పీక్‌కు ‘పేట’ థియేటర్‌లో పెళ్లి

January 10, 2019

సూపర్ స్టార్ రజినీకాంత్ కొందరికి కేవలం నటుడు మాత్రమే కాదు ‘అంతకు మించి’… రజిని అభిమానులు ఆయనపై ఉన్న అభిమానాన్ని రకరకాలుగా వ్యక్తపరుస్తూ ఉంటారు. అయితే ఈరోజు ఆయన నటించిన చిత్రం పేట విడుదలవుతున్న సందర్భంగా ఆయన అభిమానులు అంబసు, కమాచి అనే యువతీ యువకులు.. ఈ ముహూర్తాన్నే శుభముహూర్తంగా భావించి వివాహ బంధంతో ఒక్కటయ్యారు.Telugu News rajinikanth fans get married outside of peta showing theater‘పేట’ సినిమా ఆడుతున్న ఉడ్‌లాండ్స్‌ థియేటర్‌ ముందు వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అక్కడే వివాహ వేదికను ఏర్పాటు చేసుకుని, వీరిద్దరూ హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. గతంలో రజనీ నటించిన సినిమాల పోస్టర్లు వేదిక వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక్కడ జరిగిన వారి పెళ్లికి రజనీ అభిమానులందరూ ఆహ్వానితులే. ‘పేట’ సినిమా చూడడానికి వచ్చిన అభిమానులందరూ వీరి పెళ్లి చూసి హర్షం వ్యక్తం చేస్తూ అక్షింతలు వేశి ఆశీర్వదించారు. వివాహం అనంతరం అభిమానులందరికీ భోజనాలు పెట్టారు. రజనీపై తమ అభిమానం ఇలా ఉంటుందని అంబసు, కమాచి నిరూపించుకున్నారు.