రాజకీయాల్లోకి రానే రాను - MicTv.in - Telugu News
mictv telugu

రాజకీయాల్లోకి రానే రాను

November 22, 2017

తమిళనాడులో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు మీడియాకు మాంచి మాసాలాను అందిస్తున్నాయి. ఓవైపు కమల్ హాసన్ , ప్రకాశ్ రాజ్ మరోవైపు అక్కడ మారుతున్న రాజకీయ సమీకరణలు… ఈక్రమంలో అందరిచూపు రజనీ కాంత్ వైపే ఉండే.

తలైవా రాజకీయాల్లోకి వస్తాడనే  ఆశ అభిమానులందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపినుండె. కానీ రజనీ కాంత్  నేను రాజకీయాల్లోకి రానే రాను అని చేతులెత్తేసాడు.  ప్రస్తుతం 2.0 సినిమా షూటింగ్ లో బిజిగా ఉన్నానని, ఆసినిమా పూర్తయిన వెంటనే  మళ్లీ అభిమానులను ప్రత్యక్షంగా కలుస్తానని రజనీ ప్రకటించారు. అయితే రజనీ రాజకీయాల్లోకి  రానని స్పష్టం చేయడంతో తమిళనాడులో చాలా మంది నిరాశకు గురయ్యారు.