‘2.0’ మూవీ రోబోకు సీక్వెల్ కాదట

భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ 2.0 ’. ఈ సినిమా విడుదలైన తర్వాత ‘బాహుబలి’ రికార్డులు కూడా చెరిగిపొతాయని చిత్ర యూనిట్ భావిస్తున్నారట.  శంకర్, రజనీకాంత్ , అక్షయ్‌కుమార్ కాంబినేషన్‌లో తెరక్కెకుతున్న ఈ సినిమా గతంలో రజనీ  హీరోగా నటించిన రోబోకు సీక్వెల్‌ అని,  ఈ సినిమాలో రజనీ ఒక పాత్రలో రోబోగా కనిపించడంతో ఇది ఖచ్చితంగా ‘రోబో’కు సీక్వెలే అని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా 2.0 మీద క్లారీటి ఇచ్చాడు దర్శకుడు శంకర్. ‘రోబో’ సినిమాకు 2.0 కు ఎలాంటి సంబంధం ఉండదని తెలిపారు. కేవలం ‘రోబో’ చిత్రంలోని కొన్ని పాత్రలను మాత్రమే  ఈ సినిమాకు కంటిన్యూ చేశామని చెప్పారు. కథ పూర్తిగా కొత్తగా ఉంటుందని, ప్రస్తుతం ఆఖరి పాట షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని, వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయడానికి  ప్లాన్ చేస్తున్నారు.

SHARE