mictv telugu

శాశ్వత బెయిల్ కోరనున్న రాజీవ్ హంతకులు

January 10, 2019

 మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు గురై దాదాపు రెండు దశాబ్దాలు దాటిన సంగతి తెలిసిందే. అయినా రాజీవ్ హంతకులు ఇప్పటికీ జైలులోనే ముగ్గ్గుతున్నారు. వారిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ గవర్నర్ ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో వారు నిరంతర బెయిల్‌ కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నట్టు సమాచారం. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో మురుగన్‌, శంకరన్‌, పేరరివాలన్‌, నళిని సహా ఏడుగురు వేలూరు కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు.

Telugu News Rajiv Gandhi Assassination Case Convict Pleads For permanent bail .

వారి తరపు న్యాయవాది వేలూరు జైలుకు వెళ్లి వారిని కలిశారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, మురుగన్‌, శంకరన్‌, పేరరివాలన్‌, నళిని సహా ఏడుగురిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించినా, గవర్నర్‌ ఇంత వరకు దానిపై ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఈ ఏడుగురిని శాశ్వత బెయిల్‌పై విడుదల చేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నామని తెలిపారు.

Telugu News Rajiv Gandhi Assassination Case Convict Pleads For permanent bail