హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు 2,250 కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు 2,250 కోట్లు

October 21, 2017

శంషాబాద్‌‌లోని  రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని  నిర్వహిస్తున్న జీఎం‌ఆర్  హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ ఫోర్ట్ (జీహెచ్ఐఏఎల్) సంస్థ నిధులను భారీగా  సేకరించనుంది. బాండ్ల  మార్కెట్‌లో డాలర్ నోట్ల జారీ ద్వారా   రూ. 2, 250 కోట్లను సమీకరించనుంది.  జీఎంఆర్  ఇన్ ఫ్రాస్ట్రక్చర్‌కు చెందిన జీఎంఆర్ ఎయిర్ ఫోర్ట్స్ అనుబంధ సంస్థ జీ హెచ్ఐఏఎల్  4.25 శాతం రేటుతో సీనియర్  సెక్యూర్డ్ ఫిక్స్ డ్ రేటు నోట్లను జారీ చేసీ ఈ డబ్బు సేకరిస్తారు. సేకరించిన నిధుల నుంచి విమానాశ్రయానికి ఉన్న స్వదేశి, విదేశి అప్పులను( ఈసీబీ) తీర్చడానికి వినియోగిస్తామని  జీఎంఆర్ సంస్థ తెలిపింది.

ఈ డబ్బులో కొంత  మెుత్తాన్ని విమానాశ్రయం   చేపట్టిన విస్తరణ కార్యక్రమాలకు మూలధనంగా వినియోగించనున్నారు. జీఎంఆర్  గ్రూప్ కార్పొరేట్ చైర్మన్, జీఎంఆర్ ఎయిర్ పోర్ట్ ప్రెసిడెంట్ సిద్దార్థ్ కపూర్ మాట్లాడుతూ… హైదరాబాద్ విమానాశ్రయం పనీతీరును మరింత మెరుగుపరుస్తామని చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పన విభాగంలో యూఎస్ డాలర్ బ్రాండ్ మార్కెట్ నుంచి నిధులను సేకరించిన తొలి భారత సంస్ధ గ్రూప్ జీఎంఆర్  అని తెలిపారు.