mictv telugu

ప్రముఖ దర్శకుడిపై మీటూ ఆరోపణలు.. 6 నెలలు వేధించి..

January 13, 2019

దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది ఆయన దగ్గర సహాయ దర్శకురాలిగా పినిచేసిన ఓ మహిళ. ‘సంజు’ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్న సమయంలో హిరాణీ తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తున్నారు. తనను ఆరు నెలలుగా వేధిస్తున్నాడని అంటున్నారని హఫ్‌ పోస్ట్‌ ఇండియా పత్రిక పేర్కొంది. ఈ మధ్యకాలంలో ‘మీటూ’ సంఘటనలు కొంతమేరకు తగ్గుముఖం పట్టాయి. కానీ, హిరాణీ వంటి పేరున్న దర్శకుడిపై ఓ మహిళా దర్శకురాలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో మళ్లీ ప్రకంపనలు మొదలయ్యాయి.

Telugu news Rajkumar Hirani accused of sexual assault .

ఈ విషయం గురించి సదరు మహిళ ‘సంజు’ సినిమా నిర్మాత విధు వినోద్‌ చోప్రాకు, అతని సోదరి, భార్యకు మెయిల్‌ పంపినట్లు వెల్లడించింది. ‘హిరాణీ పేరున్న పెద్ద దర్శకుడు. నేను కేవలం ఆయనవద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌ను మాత్రమే. నా పట్ల చాలా పెద్ద తప్పు జరిగింది. నా పట్ల జరిగిన దారుణాన్ని చెప్పుకోలేను. ఆరోజు నా మనసు, శరీరం పాడైపోయాయి. అలా ఆరు నెలల పాటు హిరాణీ సర్‌ నన్ను లైంగికంగా వేధించారు. కానీ నాకు వేరే అవకాశం లేదు. ఉద్యోగాన్ని పోగొట్టుకోలేక మౌనంగా ఉండాల్సి వచ్చింది. ఒకవేళ ఈ ఉద్యోగాన్ని వదిలేసినా మరో ఉద్యోగం దొరకదేమోనన్న భయం, ఆయన నా పనితనం గురించి బయట తప్పుగా మాట్లాడతారేమోనన్న భయం నన్ను మౌనం వహించేలా చేసింది’ అని తను పంపిన మెయిల్లో పేర్కొందు బాదితురాలు.

కాగా, ఆమె తనపై చేసిన ఆరోపణలు అవాస్తవాలని కొట్టి పారేశారు హిరాణీ. హిరాణీ తరఫు న్యాయవాది ఆనంద్‌ దేశాయ్‌ మీడియా ద్వారా మాట్లాడుతూ.. ‘నా క్లయింట్‌ హిరాణీపై ఆమె చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. ఆయన పేరు చెడగొట్టడానికే ఇదంతా చేస్తున్నారు. ఆమె వెనకాల ఎవరో వుండి చేయిస్తున్నారు’ అన్నారు’ అని పేర్కొన్నారు.

Telugu news Rajkumar Hirani accused of sexual assault, filmmaker denies allegation