ప్రమోషన్‌లో మామా, కోడలూ 

సమంత పెళ్లి అయిన తర్వాత తొలిసారి టీవీ కెమెరా ముందుకు వచ్చింది. గురువారం హైదరాబాద్ లో జరిగిన  ‘రాజుగారిగది 2’ ప్రచార కార్యక్రమంలో మామ నాగార్జునతో కలిసి పాల్గొంది. ముద్దు ముద్దు తెలుగులో ఆహూతులను అలరించింది.  ‘రాజుగారిగది 2’ నాగార్జున కథానాయకుడుగా  తెరకెక్కుతోంది.. ఈ చిత్రానికి ఓంకార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ‘రాజుగారి గది‌’కి సీక్వెల్‌గా వస్తోంది. ఈ సినిమాలో సమంత తొలిసారిగా ఆత్మ పాత్రలో కనిపించనున్నారు. సీరత్ కపూర్, అశ్వినీ బాబు, వెన్నెల కిశోర్, సప్తగిరి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మ్యాట్నీ, ఏకే ఎంటర్‌టెన్‌మెంట్ సంయుక్తగా నిర్మించింది. సినిమా అక్టోబర్ 13న  ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

 

SHARE