mictv telugu

అగ్రకులాల కోటా బిల్లుకు రాజ్యసభ ఆమోదం..

January 9, 2019

అగ్రవర్ణాల్లోని ఆర్థికంగా వెనుకబడినవారికి విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన 124వ రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యసభ కాసేపటి కిందట ఆమోదించింది. సుదీర్ఘ చర్చల అనంతరం డివిజన్ ఓటింగ్ చేపట్టగా బిల్లుకు అనుకులంగా 150 ఓట్లు, వ్యతిరేకంగా 10 ఓట్లు పడ్డాయి. బిల్లుకు పలు పార్టీలు చేసిన సవరణలు వీగిపోయాయి.  

rr

బిల్లు లోక్‌సభ నిన్న ఆమోదించిన విషయం తెలిసిందే. దీంతో త్వరలోనే రాష్ట్రపతి ఆమోదంతో ఇది చట్టంగా మారనుంది. వచ్చే విద్యాసంవత్సం నుంచే కోటా అమల్లోకి వచ్చే అవకాశముంది. ఈ బిల్లు ఆమోదం కోసం పార్లమెంటు సమావేశాలను ఈ రోజు వరకు పొడిగించి నిరవధికంగా వాయిదా వేశారు. 

కోటా పొందడానికి అర్హతలు..

కుటుంబ వార్షికాదాయం రూ. 8 లక్షల లోపు ఉండాలి. కుటుంబానికి వ్యవసాయ భూమి 5 ఎకరాల్లోపే ఉండాలి .నివాస గృహం వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణానికి మించకూడదు. రెసిడెన్షియన్ ప్లాట్.. నోటిఫైడ్ మునిసిపల్ ఏరియాలో అయితే వంద గజాలకు మించకూడదు. నాన్  మునిసిపల్ ప్రాంతంలో 200 గజాలకు మించకూడదు. బ్రాహ్మణు, ఠాకూర్లు, రెడ్లు, కమ్మ, వైశ్యుల తదితర కులాలతోపాటు, సిక్కుల్లోని అగ్రకులాల పేదలకు కూడా కోటా అందుతుంది.