రాజ్యసభ పోలింగ్ షురూ.. మూడు స్థానాల్లోనూ టీఆర్ఎస్ గెలిచే అవకాశం - MicTv.in - Telugu News
mictv telugu

రాజ్యసభ పోలింగ్ షురూ.. మూడు స్థానాల్లోనూ టీఆర్ఎస్ గెలిచే అవకాశం

March 23, 2018

తెలంగాణ రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానల పోటీ చాలా రసవత్తరంగా సాగుతోంది. ఎవరు గెలుస్తారనేదానిమీద ఆసక్తి నెలకొంది. మొదటి ఓటును సీఎం కేసీఆర్ వినియోగించుకోగా ఉదయం 9 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. శాసనసభ కమిటీ హాలు-1లో పోలింగ్‌కు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. 5 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. కౌంటింగ్ తర్వాత వెంటనే ఫలితాలను వెల్లడిస్తారు. ఎన్నికైన అభ్యర్థులు ఏప్రిల్ రెండో తేదీ తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తారు. మొత్తం మూడు స్థానాలకు గాను టీఆర్ఎస్ నుంచి ముగ్గురు, కాంగ్రెస్ నుంచి ఒకరు పోటీ చేస్తున్నారు. మూడు స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కొక్క రాజ్యసభ అభ్యర్థి గెలిచేందుకు 30 ఓట్లు రావాల్సి ఉంది. రాజ్యసభ ఎన్నికల్లో మూడు స్థానాలను టీఆర్‌ఎస్ సులువుగా గెలుచుకోనున్నది. ప్రస్తుతం పార్టీకి 90మంది సభ్యులు ఉండగా ఏడుగురు సభ్యులు ఉన్న ఎంఐఎం మద్దతు ప్రకటించడంతో బలం 97కు చేరింది.ఈ నేపథ్యంలో ఇద్దరు అభ్యర్థులకు 32ఓట్లు, మరో అభ్యర్థికి 33 ఓట్లు కేటాయించారు. ఎన్నికల్లో గెలవడానికి 30ఓట్లు సరిపోతాయి. సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ కూడా టీఆర్ఎస్‌లో చేరారు. దీంతో, మూడు స్థానాలను కైవసం చేసుకునే మెజార్టీ టీఆర్ఎస్‌కు లభించినట్టైంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు శుక్రవారం ఉదయం తెలంగాణ భవన్‌కు చేరుకోనున్నారు. అల్పాహారం అనంతరం ప్రత్యేక బస్సుల్లో అసెంబ్లీకి బయలుదేరుతాటీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు శుక్రవారం ఉదయం తెలంగాణ భవన్‌కు చేరుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. అల్పాహారం అనంతరం ప్రత్యేక బస్సుల్లో అసెంబ్లీకి బయలుదేరనున్నారు. ప్రతి ఎమ్మెల్యే ఓటింగ్‌లో పాల్గొనేవిధంగా ఆయాజిల్లాల మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. అసెంబ్లీ ప్రారంభమయ్యే వరకు అత్యధిక ఎమ్మెల్యేలు ఓటుహక్కు వినియోగించుకునే విధంగా చూడాలని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రతి ఎమ్మెల్యే ఓటింగ్‌లో పాల్గొనేవిధంగా ఆయాజిల్లాల మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. అసెంబ్లీ ప్రారంభమయ్యే వరకు అత్యధిక ఎమ్మెల్యేలు ఓటుహక్కు వినియోగించుకునే విధంగా చూడాలని సీఎం కేసీఆర్ సూచించారు.