mictv telugu

జయరాంను చంపి, గోవా వెళ్లి ఎంజాయ్ చేశా.. రాకేష్ రెడ్డి

February 13, 2019

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులో నిందితులైన రాకేష్ రెడ్డి, శ్రీనివాస్‌లను బంజారాహిల్స్ ఏసీసీ కార్యాలయంలో విచారిస్తున్నారు పోలీసులు. కోర్టు ఆదేశాల మేరకు వారిని అదుపులోకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు మూడు రోజులు విచారించి కీలక సమాచారాన్ని రాబట్టారు. ఈ హత్య కేసులో నేరాన్ని అంగీకరించిన రాకేష్ రెడ్డి సంచలన విషయాలను బయటపెట్టాడు.

Telugu News Rakesh reddy prime accused in industrialist Jayaram murder case said he went to goa after killing Jayaram..

జయరామ్‌ను హత్య చేసిన తర్వాత మృతదేహంతో పాటు నందిగామ వెళ్లానని చెప్పిన రాకేశ్ రెడ్డి… మృతదేహం ఉన్న కారును అక్కడే వదిలేసి హైదరాబాద్ వచ్చానని చెప్పాడు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత గోవాకు బయలుదేరి వెళ్లానని, అక్కడ కాసినోలో రూ.20 లక్షలు సంపాదించానని చెప్పాడు. అయితే ఆ తర్వాత మళ్లీ అందులో సంపాదించిన మొత్తాన్నీ పోగొట్టుకున్నట్టు ఒప్పుకున్నాడు. అలాగే హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించానని తెలిపారు. పథకం ప్రకారం హత్య చేయలేదని…అనుకోకుండా జరిగిపోయిందని తెలిపాడు.Telugu News Rakesh reddy prime accused in industrialist Jayaram murder case said he went to goa after killing Jayaram