మోదీ నాన్నా.. నీ అల్లుడు ఇతడే! - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ నాన్నా.. నీ అల్లుడు ఇతడే!

December 16, 2017

అందరి దృష్టినీ తమవైపు తిప్పుకోవాలంటే, కొందరికి మాత్రం ఒకటే దారి.. అదే వివాదాలు సృష్టించడం. ఎవరేం అనుకుంటే వాళ్లకేం.. తిట్టెటోళ్లు తిడుతూనే ఉంటారు, అవన్నీ పట్టించుకోరు. పబ్లిసిటీ వచ్చిందా లేదా అనేదే వారికి ముఖ్యం.

ఈపనిలో బాలీవుడ్ భామ రాఖీ సావంత్ అందరికంటే ముందు వరుసలో ఉంటుంది.  అంతకు ముందు ప్రధాని మోదీ బొమ్మలున్న  పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుని ‘ఇతనే నాకలల రారాజు’ అని చెప్పి అందరిచేత తిట్లు తిన్నది. మళ్లా ఇప్పుడు ఓ వీడియోతో వివాదం సృష్టించడానికి సిద్దమైంది.

 


ఆ వీడియోలో తన బాయ్ ఫ్రెండ్‌తో కారులో వెళ్తూ ఇలా అంది ‘ నన్నందరూ నీ బాయ్ ప్రెండును ఎప్పుడు పరిచయం చేస్తావ్ అని అంటున్నారు ఇదిగో ఇతనే నా బాయ్ ప్రెండ్ అంటూ చెప్పింది. అంతేకాదు  నేను బాలీవుడ్ హీరోయిన్‌ను.. మోదీ నాకు పెద్ద ఫ్యాన్ అంటూ తన బాయ్ ప్రెండ్‌కు చెప్పింది. అంతటితో ఊరుకుందా ? ఊరుకుంటే రాఖీ సావంత్ ఎలా అవుతుంది.

ఏకంగా మోదీని నాన్నా అంటూ ‘ఇదిగో మీ అల్లుడు’ అని బాయ్ ప్రెండ్ ను పరిచయం చేసింది. ఈ వీడియో చూసిన వారందరూ రాఖీ  పిచ్చి పీక్స్ కి వెళ్లిందని  లేకపోతే ఇలా మోదీని ఓసారి కలల రాకుమారుడు అని ఇంకోసారి నా తండ్రి అని పిచ్చి పిచ్చి కూతలు కూయదని రాఖీపై మండిపడుతున్నారు.