రకుల్‌కు మా బాధ అర్థం కాదు.. శ్రీరెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

రకుల్‌కు మా బాధ అర్థం కాదు.. శ్రీరెడ్డి

March 29, 2018

ఈసారి నటి శ్రీరెడ్డి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ను టార్గెట్ చేసింది. ‘ మీరు పెద్ద హీరోయిన్ అవ్వొచ్చు.. మీకు కోట్లకు కోట్లు డబ్బులు వస్తున్నాయి కదా మాలాంటి వాళ్ళ పెయిన్ మీకేం తెలుస్తుంది ? ’ అంటూ రకుల్‌పై విరుచుకుపడింది శ్రీరెడ్డి. మంగళవారం మా సభ్యుల సమావేశంలో మంచులక్ష్మితో పాటు రకుల్ మాట్లాడింది. ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ గురించి ప్రస్తావించింది. ‘ నేను వచ్చిన ఈ ఐదేళ్లలో నాకెప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అలాంటి పరిస్థితులు ఎదురవలేదు. ఎవరెవరో పబ్లిసిటీ కోసం కాంట్రవర్సీగా మాట్లడుతున్నారు ’ అని మాట్లాడింది రకుల్. అందుకు కౌంటర్‌గా శ్రీరెడ్డి స్పందించింది. ‘ నేనేదో పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నానని రకుల్ అంటోంది. తను నాలాగా, నాలాంటి ఇంకెందరో అమ్మాయిల్లా ఆ పెయిన్ భరించుంటే నా బాధ తనకు అర్థం అయ్యేది. మీకు కోట్లకుకోట్లు డబ్బులు వస్తున్నాయ్ కాబట్టి అలా అనిపించకపోవచ్చు. మాలాంటి ఎందరో చిన్న చిన్న ఆర్టిస్టులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఆమెకు ఎప్పటికీ తెలియదు.మీరు నార్త్ నుంచి ఇక్కడకి వచ్చి కబుర్లు చెబితే కుదరదు. నేను ఇబ్బంది పడుతున్న తెలుగువారి గురించే మాట్లాడుతున్నాను. అలా వచ్చి తొలి సినిమా హిట్టు కొట్టి ఇక్కడ రాజభోగాలు అనుభవిస్తున్నారు కాబట్టి మీకు మా బాధ పబ్లిసిటీలానే కనిపిస్తుందిలే. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు ’ అంటూ శ్రీరెడ్డి రకుల్‌కు వార్నింగ్ ఇచ్చినంత పని చేసింది.