రకుల్.. నీ నిర్ణయానికి  సలాం.. ! - MicTv.in - Telugu News
mictv telugu

రకుల్.. నీ నిర్ణయానికి  సలాం.. !

November 24, 2017

రకుల్ ప్రీత్ సింగ్ అందగత్తె మాత్రమే కాదు. తనకు అందమైన మనసు  కూడా వున్నదని నిరూపించింది. ఎంతో మందికి ఆదర్శంగా నిలబడింది. నగరంలో మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్స్ నిర్వహించిన ఆర్గాన్ డొనేషన్ ప్లెడ్జ్ ( అవయదానానికి ప్రతిజ్ఞ ) కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్నది రకుల్. ఈ సందర్భంగా   నేను సైతం అంటూ.. మరణానంతరం అవయవ దానం చేస్తానని ఆర్గాన్ డొనేషన్ ప్లెడ్జ్ పత్రంపై సంతకం చేసింది. అవయవ దానం విశిష్ఠతను పది మందికి తెలిసేలా చేసింది . ఈనెల 26 న అవయవ దానంపై అవగాహన కోసం నిర్వహిస్తున్న 10 కే రన్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా పిలుపునిచ్చింది. గతంలో సమంత కూడా అవయవ దానానికి అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు సమంత రూటులోకి రకుల్ కూడా వచ్చి చేరింది.