శ్రీరెడ్డికి రకుల్ కౌంటర్... - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీరెడ్డికి రకుల్ కౌంటర్…

April 10, 2018

సినిమా అవకాశాల కోసం కొందరు ఏమైనా చేస్తారేమో,కాని తాను మాత్రం అలా చేయలేదని, చేయనని నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. కాస్టింగ్ కౌచ్ గురించి  తన గళం విప్పి పోరాటం చేస్తున్న శ్రీరెడ్డిపై మండిపడిన రకుల్ మాట్లాడుతూ…

‘అమ్మాయి పిలవగానే చెప్పిన చోటుకు వస్తుందని, చెప్పినట్టు చేస్తుందని చెప్పి, ఆమెపై వంద కోట్లు  పెట్టుబడి పెట్టి ఎవరు సినిమా తీయరు. కాస్టింగ్ కౌచ్‌పై చర్చ ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. నేను నా గురించి మాట్లాడగలను. నాకు ఇప్పటివరకు అలాంటి అనుభవాలు ఎదరుకాలేదు.

సినీ పరిశ్రమలో ప్రతిభే చివరి వరకు నిలబడుతుంది. పరిశ్రమలోకి కొత్తగా  వచ్చే అమ్మాయిలకు నేను చెప్పింది ఒకటే.. అవకాశాల పేరుతో అడ్వాంటేజ్ తీసుకునేందుకు చాలా మంది చూస్తుంటారు. వారు కోరుకుంది ఇవ్వాలా? వద్దా ? అనే నిర్ణయం మహిళలే నిర్ణయించుకోవాలి. సరైన అవకాశం రావడానికి సమయం పడుతుంది,దాని కోసం ఓపిగ్గా ఎదరు చూడాలని’ రకుల్ సూచించింది.