mictv telugu

‘నిజం తెలుసుకోవడానికి సిద్దంకండి’.. లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ రెలీజ్ డేట్

February 10, 2019

సామాన్య ప్రేక్షకుడితో పాటు రాజకీయ వర్గాలు కూడా ఎదురుచూస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారైనది. ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న ఉదయం 9.27 గంటలకు లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్‌ను రిలీజ్ చేస్తానని ప్రకటించారు రామ్ గోపాల్ వర్మ.

వర్మ ఈరోజు ట్విట్టర్‌లో స్పందిస్తూ..‘ఎన్టీఆర్-లక్ష్మీ పార్వతిల మోస్ట్ డైనమిక్ లవ్ స్టోరీ ట్రైలర్‌ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న ఉదయం 9.27 గంటలకు విడుదల చేస్తున్నాం. విశ్వాసం లేని కుటుంబాలు, విధేయత లేని అనుచరులు, వెన్నుపోటుదారుల సమాహారమే ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా. నిజాన్ని తెలుసుకోవడానికి సిద్ధమైపోండి’ అని ట్వీట్ చేశారు.

Telugu News ram gopal varma announced lakshmi’s ntr trailer release date