వర్మ , నాగ్ సినిమాలో హీరోయిన్ ఎవరంటే? - MicTv.in - Telugu News
mictv telugu

వర్మ , నాగ్ సినిమాలో హీరోయిన్ ఎవరంటే?

November 30, 2017

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, హీరో నాగార్జున కాంబినేషన్‌లో  కొత్త  సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగ్‌తో జతకట్టేది ఎవరనే ఆసక్తి నెలకొంది.  టబు.. అని మరొకరు.. అని వేరువేరు పేర్లు  మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే వర్మ తన హీరోయిన్ అంటూ ఓ భామ ఫోటోలను  సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ‘నేను నాగార్జునతో తీస్తున్న సినిమాలో ఫీమేల్ లీడ్ ఎవరన్నదీ మీడియాలో రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి. అవన్నీ తప్పు.. హీరోయిన్‌గా చేస్తున్నది ఒక కొత్త అమ్మాయి తన పేరు మైరా నరీన్ ఈ ఫోటోలు ఆ అమ్మాయివి’ అంటూ మైరా ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.