నాన్నా ఏంటి నీ చెత్త పోస్టులు : వర్మ కూతురు - MicTv.in - Telugu News
mictv telugu

నాన్నా ఏంటి నీ చెత్త పోస్టులు : వర్మ కూతురు

November 2, 2017

పవన్ కళ్యాణ్ కొడుకు పేరుపై  వర్మ పెట్టిన పోస్టు గురించి  ఆయన కుతూరు  రేవతి  మండిపడింది. ‘నాన్న నీవు పెట్టిన చెత్త పోస్టు నాకు అసలు ఏం అర్థం కాలేదు, చరిత్రకు సంబంధించిన, సంబంధంలేని  విషయాలను పోలుస్తూ క్లిష్టమైన  పదాలతో  జీరో సెన్స్‌తో  ఏమేమో రాసావు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కూతురు చేసిన వ్యాఖ్యలపై  స్పందించిన  వర్మ ‘ పవన్‌కళ్యాణ్‌లో దాగివున్న తాత్విక విలువల్ని అర్థం చేసుకునే విషయంలో, నీకున్న అవగాహనా శక్తి ఏమిటో  తెలుస్తోందని, నేను పవన్‌ను నీ కంటే ఎక్కువ ఇష్టపడుతాను’. అని  కూతురికి సమాధానం చెప్పాడు.  పవన్ కొడుకు పేరు  గురించి తండ్రిా, కూతుర్ల మధ్య  ఈవిధంగా  వాగ్వాదం జరిగింది.  ఈతతంగాన్ని అంతా వర్మ తన ఫేస్‌బుక్‌లో  రాసాడు.