శ్రీదేవిని చూస్తూ..వోడ్కాను ఎంజాయ్ చేస్తూ - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీదేవిని చూస్తూ..వోడ్కాను ఎంజాయ్ చేస్తూ

November 28, 2017

అలనాటి అందాల తార శ్రీదేవిని.. వర్మ ఎంతగా ఆరాధిస్తాడో అందరికి తెలిసిందే. చాలా సందర్భాల్లో వర్మే ఆ విషయాన్ని చెప్పాడు. అయితే తాజాగా నటి చార్మి వర్మకు సంబంధించిన  ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

N the worshiper is here @rgvzoomin on the floor for @sridevi.kapoor .. ‬ Ramuism n his fanism ‬

A post shared by Charmmekaur (@charmmekaur) on

అందులో వర్మ నేలపై కూర్చొని  ప్లాస్మా టీవీలో అసలు ఏ మాత్రం చూపు తిప్పకుండా, పక్కన వారిని పట్టించుకోకుండా  సన్నిడియోల్‌, శ్రీదేవి కలిసి నటించిన ‘ఛాల్‌బాజ్‌’ అనే హిందీ చిత్రంలోని పాటలో శ్రీదేవిని చూస్తూ, మధ్య, మధ్యలో వొడ్కా తాగుతూ ఆపాటలో లీనమైపోయాడు. ఈవీడియోను  పోస్టు చేస్తూ ‘భక్తుడు రామ్‌గోపాల్‌ వర్మ.. శ్రీదేవి కోసం ఇక్కడ నేలపై కూర్చొని ఉన్నారు. రాముఇజం, ఆయన ఫ్యానిజం’ అని చార్మి తన ఇన్ స్టాగ్రాంలో పోస్ట్‌ చేసింది. ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.