టీడీపీపై  వర్మ వెటకారపు ట్వీట్లు.... - MicTv.in - Telugu News
mictv telugu

టీడీపీపై  వర్మ వెటకారపు ట్వీట్లు….

February 12, 2018

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వంపై సైటర్లు వేశారు..ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని టీడీపీ ఎంపీలు ఆడుతున్న డ్రామాలు చూస్తుంటే ఆయనకు చికాకు పుట్టించాయోమో. వారిపై వెటకారంగా ట్వీట్లు చేశాడు.‘ ఇలాంటి జోకర్లు ఏపీ ప్రజలకు ప్రతినిధులుగా ఎన్నిక కావటం చూస్తున్న నరేంద్ర మోదీ బహుశా ఏపీని ఓ జోక్‌గా భావిస్తున్నాడేమో. వీరు జోకర్లకు ఎక్కువ – లీడర్లకు తక్కువ ’ అంటూ..ఓ వెటకారపు తూటాను పేల్చాడు. ఇక మరో ట్వీట్‌లో ‘ టీడీపీకి చెందిన వీళ్లు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం ఉన్న తెలుగు దేశం పార్టీ పరువును జాతీయ స్థాయిలో అవమానానికి గురి చేస్తున్నారు ’ అంటూ మరోసారి వెటకారంగా ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌లో ‘ అమెరికాలో కూడా టీడీపీ అధికారంలోకి వస్తుంది ’ అని మంత్రి లోకేష్ అన్న వ్యాఖ్యలకు పంచ్ వేశారంటున్నారు ఆయన ఫాలోవర్లు.

అధికార పక్షంలో ఉండి కూడా  ప్రత్యేక హోదాను సాధించలేకపోతున్న టీడీపీ.. మరో వైపు కూటమి నుంచి బయటకు వచ్చి పోరాటం చేయకుండా వేషాలు వేస్తోంది. ఈ క్రమంలో కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నామనే డ్రామాలు వర్మకు నచ్చక ఇలా ట్వీట్లు చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు కొందరు. కానీ కొందరు అతని ట్వీట్లను వ్యతిరేకిస్తున్నారు. గతంలో కూడా వర్మ ఏపీ హోదాపై పలు ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే.