ఎట్టకేలకు ఠాణాకు వర్మ..  పోలీసుల ప్రశ్నలు ఏంటి? - MicTv.in - Telugu News
mictv telugu

ఎట్టకేలకు ఠాణాకు వర్మ..  పోలీసుల ప్రశ్నలు ఏంటి?

February 17, 2018

గాడ్, సెక్స్ ఆండ్ ట్రూత్’  సినిమా తీసి పలు మహిాళా సంఘాల చేత  తిట్లు తిన్న వర్మ ఎట్టకేలకు  కేసు విచారణకు హాజరయ్యాడు. ‘ ‘జీఎస్టీ’  సినిమా  వివాద సమయంలో  ఓ చానల్ లో  చర్చిస్తున్నప్పుడు వర్మ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశాడటూ సామాజిక కార్యకర్త దేవీ వర్మపై  కేసు పెట్టింది. ఈకేసుకు సంబంధించన విచారణకు హాజరు కావాలని సీసీఎస్ పోలీసులు వర్మకు నోటీసులు ఇచ్చారు. తాను షూటింగ్‌లో బిజీగా ఉన్నానంటూ  ఇప్పటికే రెండు సార్లు వర్మ విచారణకు  రాలేదు. అయితే  పోలీసులు ఇచ్చిన  నోటీసులతో ఈరోజు రాక తప్పలేదు.

వర్మ తన అడ్వకేట్‌తో  కలిసి సీసీఎస్ కార్యాలయానికి వచ్చాడు. లోపలికి వీరిద్దరిని తప్ప మరెవ్వరిని అనుమతించలేదు. సాయంత్రం 4 గంటల వరకు విచారణ కొనసాగనుందని సైబర్ క్రైమ్ డీసీపీ రఘువీర్ మీడియాకు చెప్పారు. చర్చా సమయంలో  మాట్లాడిన అంశాలను, అందుకు గల వీడియో ఫుటేజ్‌లను పరిశీలించిన తర్వాత  వాటికి అనుగుణంగా వర్మ  ఇచ్చే సమాధానాలను బట్టే ఆయనను అరెస్ట్ చేయాలా? వద్దా? అనేదానిపై క్లారిటీ వస్తుందని  ఆయన  స్పష్టం చేశారు.

విచారణలో వర్మ ఎదుర్కునే ప్రశ్నలు ఇవే కావచ్చు…

  • ఐటీ యాక్ట్ ప్రకారం మహిళలను అశ్లీలంగా చూపించడం తప్పు. దీనికి మీ సమాధానం ఏమిటి?
  • ఓ టీవీ ఛానల్ చర్చలో విశాఖపట్నంకు చెందిన మహిళ మీద మీరు చేసిన కామెంట్లు అభ్యంతరకరం కాదా?
  • దేవితో పోర్న్ సినిమా తీస్తాననడం ఎంత వరకు కరెక్ట్?
  • ఈ సినిమాకు భారతీయ చట్టాలు వర్తించవు అని మీరు అంటున్నారు…. దీనికి మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి?
  • సినిమాను అమెరికాలో తీశాను, అక్కడ నుంచే ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేశామని చెబుతున్నారు. సినిమాను ఎలా తీశారు? పెట్టుబడి ఎవరు పెట్టారు?
  • విమియో వెబ్‌సైట్‌కు ఈ సినిమాను ఎంతకు అమ్మారు?