వర్మను అరెస్ట్ చెయ్యాలంటూ నిరసనలు… - MicTv.in - Telugu News
mictv telugu

వర్మను అరెస్ట్ చెయ్యాలంటూ నిరసనలు…

December 17, 2017

నరుకుడు, సంపుడు నేపథ్యంలో ఈమధ్యే  రాంగోపాల్ వర్మ ‘కడప’ టైటిల్‌తో వెబ్‌సిరీస్ ట్రైలర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులోని పాత్రలు ఏ ఒక్కటి కూడా కల్పితాలు కావు అని ట్రైలర్ మొదలవ్వక ముందే వర్మ క్లారిటీ ఇచ్చాడు. అయితే వర్మ తీసిన ఈ వెబ్ సిరీస్‌పై కొందరు మండిపడుతున్నారు.

‘కడప’లో ఫ్యాక్షన్ ఉన్నట్టు చూపిస్తే  రాయలసీమకు వచ్చే పెట్టుబడులు కూడా రావని, రాయలసీమ అభివృద్ది ఆగిపోతుందని, అందుకే వివాదాస్పద వెబ్ సిరీస్ తీసిన  వర్మను వెంటనే అరెస్ట్ చెయ్యాలని ‘రాయలసీమ విమోచన సమితి’ నాయకులు ఆదివారం అనంతపురం త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు వర్మను అరెస్ట్ చెయ్యాలంటూ  ఆర్ట్స్ కాలేజీ ముందు నిరసలనలు తెలిపారు.

రాంగోపాల్ వర్మపై కోర్టులో పిల్‌ కూడా వేయనున్నట్లు సమితి నాయకులు స్పష్టం చేశారు. మరి ఇన్ని కొట్లాటల నేపథ్యంలో వర్మ తన వెబ్‌సిరీస్‌ను విడుదల చేస్తాడా? లేక నావెబ్‌సిరీస్ నాఇష్టం అంటూ ఎవ్వరినీ లెక్క చేయడా? చూడాలె మరి.