అయోధ్యలో రాముని గుడి.. లక్నోలో బాబ్రీ మసీదు... - MicTv.in - Telugu News
mictv telugu

అయోధ్యలో రాముని గుడి.. లక్నోలో బాబ్రీ మసీదు…

November 20, 2017

అయోధ్యలో రామ మందిరం గురించి ఎన్నో ఏళ్ళుగా వివాదం నడుస్తున్నది. తాజాగా ఈ వివాదం పరిష్కారానికై షియా వక్ఫ్‌బోర్డ్ కొత్త ప్రతిపాదన చేసింది. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే యూపీ రాజధాని లక్నో నగరంలో కొత్త బాబ్రీ మసీదు నిర్మించాలని కోరింది.

మసీదు కోసం లక్నోలో ఎకరం స్థలం కేటాయించాలని కోరింది. అన్నీ వర్గాలతో చర్చించాకే ఈ ప్రతిపాదన చేశామని వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ సయ్యద్ వసీద్ రిజ్వీ తెలిపారు. కాగా వారం రోజుల క్రితం రజ్వీ అయోధ్యలో మసీదు అవసరం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే.  ఈ విషయంపై సున్నీ వక్ఫ్ బోర్డు కూడా వివిధ కోర్టుల్లో కేసులు వేశారు. వారి కేసులతో విసిగిపోయామని, ఆ మసీదుపై షియాలకు మాత్రమే హక్కు వుందని రజ్వీ పేర్కొన్నారు.

మరోవైపు ఈ వివాదంపై కేసు  సుప్రీంకోర్టులో  ఉన్నందున పరిష్కారానికి డిసెంబర్ 5న కొందరు మహంతులతో కలిసి కోర్టుకు ఈ ప్రతిపాదన గురించి నివేదించనున్నారు. అయోధ్య లేదా ఫైజాబాద్‌లో కొత్తగా మసీదు నిర్మించాల్సిన అవసరం లేదని ఏకగ్రీవంగా తీర్మానించామని ఆయన తెలిపారు.  అఖిల భారతీయ అఖాడా పరిషత్‌ కూడా అ`యోధ్యలో మసీదు నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.