రామమందిరం కట్టుకోండి.. నన్ను రాజ్యసభకు పంపండి - MicTv.in - Telugu News
mictv telugu

రామమందిరం కట్టుకోండి.. నన్ను రాజ్యసభకు పంపండి

February 15, 2018

‘అయోధ్యలో రామాలయం నిర్మించాలంటే మసీదు నిర్మాణానికి స్థలం, డబ్బుతోపాటు నాకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు కార్యనిర్వాహక మాజీ సభ్యుడు మౌలానా సల్మాన్ హస్నీ నద్వీ  బేరం పెట్టాడు ’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు  అయోధ్య సద్భావన సమన్వయ సమితి అధ్యక్షుడు అమరనాథ్ మిశ్రా. బాబ్రీ మసీద్ – రామజన్మభూమి వివాదంపై చర్చించేందుకు ఈనెల 5వ తేదీన తాను సల్మాన్ నద్వీని కలిసినట్లు ఈ ప్రతిపాదన తెచ్చాడని వెల్లడించారు. అయోధ్యలో మక్కాలాంటి మసీదును నిర్మించాలని, రాజ్యసభ సభ్యత్వంతో పాటు, వెయ్యికోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు మిశ్రా ఆరోపించారు. అమరనాథ్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.అమరనాథ్ మిశ్రా ఆరోపణలపై సల్మాన్ నద్వీ స్పందించారు. ‘మిశ్రా ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదు. ఇది కేవలం రెండు వర్గాల ప్రజలను రెచ్చగొట్టేందుకే అతనలా నామీద లేనివి కల్పించి మాట్లాడుతున్నాడు. గతంలో నేను అయోధ్యలో రామాలయం నిర్మాణానికి శ్రీశ్రీ రవిశంకర్‌ను కలిసి నా మద్దతు తెలిపాను ’ అని విరుచుకు పడ్డారు.