రామసేతు వా‘నరులు’ కట్టిందే.. ! - MicTv.in - Telugu News
mictv telugu

రామసేతు వా‘నరులు’ కట్టిందే.. !

December 13, 2017

సీతను లంకకు ఎత్తుకెళ్ళిన రావణాసురుడి చెర నుంచి ఆమెను విడిపించడానికి, రాముడు హనుమంతుడు, వానర సైన్యంతో కలిసి అక్కడికి వారధి నిర్మంచాడని రామాయణంలో చదువుకున్నాం.  సముద్రం గుండా నిర్మించిన దీని పేరు రామసేతు అని తెలుసు. కాగా ఇది వాస్తవమని, అవాస్తవమని అనేక కథనాలు వినిపించాయి. అయితే అలాంటి పుకార్లకు ఫుల్‌స్టాప్ పెడుతూ  అమెరికన్‌ సైన్స్‌ ఛానల్‌ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. అసలు రామాయణం అనేది కట్టుకథ అన్నవారికి ఇది వాస్తవంగా జరిగిందేనని, రామసేతు వారధి మానవ నిర్మిత కట్టడమేనని చెబుతోంది.భారత్‌-శ్రీలంకలను కలుపుతూ.. రామాయణ కాలంలో వారధి నిర్మించారని..ఇది సత్యమేనంటోంది.  డిస్కవరీ కమ్యూనికేషన్‌కు చెందిన సైన్స్‌ ఛానల్‌ ఈ  ప్రత్యే కథనాన్ని రూపొందించి ప్రసారం చేయటం విశేషం. ఈ కథనం కోసం వారధి గురించి దాదాపు 30 మైళ్ళ వరకు సైంటిస్టులు పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల్లో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. భారత్ – శ్రీలంకను కలుపుతూ నిర్మించిన రామసేతు హిందూ విశ్వాసాల పరంగా, శాస్త్ర పరిశోధనల పరంగా నిజమేనంటున్నారు.

తమిళనాడులోని ఆగ్నేయ ప్రాంతంలోనున్న రామేశ్వరం నుంచి శ్రీలంకలోని వాయువ్య ప్రాంతంలోని మన్నార్‌ వరకూ ఈ వారధిని నిర్మించారు. ఇది పూర్తిగా సున్నపురాయితో నిర్మించింది. ఈ సున్నపు రాళ్ళు ఇసుక శక్తితో దృఢంగా నీటిలో మునగకుండా నీటి మీద తేలుతాయని తెలిపారు.