సిట్టిగాడి గుండె దోసుకున్న  రామలక్ష్మి! - MicTv.in - Telugu News
mictv telugu

సిట్టిగాడి గుండె దోసుకున్న  రామలక్ష్మి!

February 9, 2018

‘ రంగస్థలం ’ సినిమాకు సంబంధించి మరొక టీజర్ విడుదలైంది. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా తొలి  టీజర్‌లో చిట్టిబాబు ( రాంచరణ్ ) మాత్రమే కనిపించాడు. సమంతను అస్సలు చూపించలేదు. అప్పుడు సమంత ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు. వారికోసం ఇప్పుడు రెండో టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో రామలక్ష్మి ( సమంత ) పల్లెటూరి అమ్మాయిగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సమంత సైకిల్ మీద వస్తుంటే చిట్టిబాబు ‘ ఓహో ఏం వయ్యారం.. ఏ వయ్యారం.. ఏమాటకామాటే సెప్పుకోవాలి గానీ అండీ.. ఈ పిల్లెదురొత్తుంటే మా ఊరికే 18 సంవత్సరాల వయసొచ్చినట్టుగా ఉంటుందండీ.. ’ అంటూ తెగ సంబర పడిపోతుంటాడు.

‘ఈ సిట్టిగాడి గుండెకాయని గోలెట్టించేసింది ఈ పిల్లేనండి.. పేరు రామలక్ష్మండి..’ అంటూ రామలక్ష్మి మీద చిట్టిబాబు తన ప్రేమను వ్యక్తం చేయటం వీక్షకులను ఆకట్టుకుంటోంది. పల్లెటూరి అమ్మాయంటే ఇలాగే వుంటుందనేలా సమంత లుక్ ఆమె అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.