స్వీపర్‌కు లక్షన్నర జీతం అని ఈమధ్య బాగా సర్క్యలేట్ అయిన వార్త. స్వీపర్‌కే లక్షన్నర జీతం వుంటే ఆమెకన్నా పైస్థాయి ఉద్యోగులకు జీతాలు ఎంతుండాలి అని రకరకాల కామెంట్లు వినిపించాయి. రాజమహేంద్రవరానికి చెందిన
కోల వెంకటరమణమ్మకు లక్షన్నర జీతం వస్తున్న మాట వాస్తవమే కానీ.. ఆమెకు ఆ జీతం డబ్బులు కొడుకు వైద్యానికే ఖర్చు అయిపోతున్నాయి. లక్షన్నర జీతంతో ఆమె మంచి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నట్టుందని చాలామంది అనుకున్నారు. కానీ ఆమెకు నెలనెలా వచ్చిన జీతం ఆసుపత్రికే పోతోంది. కొడుకు ప్రాణాలు కాపాడుకోవాలని ఆ తల్లి తన జీతాన్ని ఖర్చు చేస్తోంది.
ఆమెకు ఇద్దరు కొడుకులు. భర్త రైల్వేలో పనిచేసేవాడు. భర్త కాలం చేయడంతో ఇద్దరు కొడుకుల భారం తనమీదే పడింది. ఒక కొడుకుకి భర్త ఉద్యోగం రాగా, మరో కొడుకు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గుండె జబ్బు, ఫిట్స్‌తో బాధపడుతున్నాడు. అతని జబ్బుకోసం రమణమ్మ తనకు వచ్చిన జీతాన్ని కొడుకు వైద్యంకోసం వెచ్చిస్తోంది. కట్టుకున్నవాడు కాటికి పోయాడు, కొడుకులతో అయినా సంతోషంగా బతకడం లేదు ఆతల్లి. కొడుకు త్వరగా నయం కావాలని ఆతల్లి పడుతున్న ఆరాటం కనిపించని మరోకోణం.
40 ఏళ్ళ సర్వీస్ ఆమెది…
రమణమ్మ ఏమీ చదువుకోలేదు. కేవలం సంతకం పెట్టేంత అక్షరాలు మాత్రమే నేర్చుకుంది. 1978లో విద్యుత్ శాఖలో తన 16వ ఏట రోజూవారి కూలిగా చేరింది. చేరిన మూడేళ్లకే రమణమ్మ పర్మినెంట్ ఉద్యోగి అయింది. అప్పటి నుంచి రాజమహేంద్రవరం సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయంలోని పని చేస్తోంది. ఈ క్రమంలో ఆమె 40 ఏళ్ళ సర్వీస్‌ను ముగించుకుంది. రమణమ్మ ఉదయం 8 గంటలకు భోజనం డబ్బాతో ఉద్యోగానికి పోయి, రాత్రి 8 గంటలకు ఇంటికి వెళ్తుంది. చాలా కాలంగా చేసిన సర్వీసు కావడంతో జీతం కూడా భారీగా పెరుగుతూ వచ్చింది