రాందేవ్ ఓ దొంగబాబా.. - MicTv.in - Telugu News
mictv telugu

రాందేవ్ ఓ దొంగబాబా..

September 12, 2017

నరేంద్ర మోడీ భక్తులను ఉద్దేశించి అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన   కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ యోగా గురువు బాబా రాందేవ్ పై నోరు చేసుకున్నారు. రాందేవ్ ను దొంగ బాబా అని అన్నారు. ‘ కషాయ వస్త్రాలు ధరించిన ఈ ఆధ్యాత్మిక గురువు వ్యాపారాలు చేయవచ్చో లేదో తెలపాలి’ అఖిల భారతీయ ఆఖాడా పరిషత్‌ ను అడిగారు.

డిగ్గీ మీడియాతో మాట్లాడుతూ.. ’ఇటీవల  అఖిల భారతీయ అఖాడా పరిషత్‌  విడుదల చేసిన 14 మంది దొంగ బాబాల పేర్లను ప్రస్తావించారు. అందులో రాందేవ్ బాబా రాందేవ్ పేరును దొంగ బాబాల జాబితాలో చేర్చకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది. నకిలీ ఉత్పత్తులను నాణ్యమైన వస్తువులుగా నమ్మిస్తూ రాందేవ్ వాటిని విక్రయిస్తున్నారు. అప్పట్లో ఓం బాబా బిగ్ బాస్ షోలో పాల్గొన్నట్టు ఇప్పుడు రాందేవ్ బాబా కూడా ఒక టీవీ షో చేస్తున్నాడు. ఈ విధంగా దేశ ప్రజలను మోసం చేస్తూ, నకిలీ ఉత్పత్తులతో వ్యాపారం చేసే రాందేవ్ కూడా నకిలీ బాబేనే’ అని  దిగ్విజయ్ అన్నారు. నకిలీ బాబాల లిస్టులో ఆశారాం బాపూ, రాధేమా, సచ్‌దరంగి, గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌, ఓం బాబా, నిర్మల్‌ బాబా, విశ్వానంద్‌, స్వామి అశ్మిదానంద్‌, ఓం నమః శివాయ్‌, నారాయణ్‌ సాయి రాంపాల్‌లు ఉన్నారు.