వర్మ సినీలక్ష్మీపార్వతి ఈమెనే.. పేరు..

దివంగత నటుడు ఎన్టీఆర్ చరమాంకంపై బయోపిక్ తీస్తున్న వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఎట్టకేలకు హీరోయిన్ దొరికింది. చంకలోనే మేకపిల్లను పెట్టుకుని ఊరంతా వెతికినట్లు ఆయన గత సినిమాలో పనిచేసిన కథానాయికే ఎన్టీఆర్ రెండో భార్యగా కనిపించనుంది. కన్నడ నటి యజ్ఞాశెట్టి.. వర్మ తీస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో లక్ష్మీపార్వతిగా నటిస్తున్నారు. లక్ష్మిపార్వతి గెటప్‌లో ఉన్న యజ్ఞాశెట్టి ఫొటోలను వర్మ సోషల్ మీడియాలలో పోస్ట్ చేశారు.

Telugu news Ramgopal Varma finds his latest movie lakshmis NTR heroine for Lakshmiparvati character kannada actress Yagna Shetty .

యజ్ఞాశెట్టి గతంలో వర్మ తీసిన ‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమాలో వీరప్పన్ భార్య ముత్తలక్ష్మిగా నటించింది. తెలుగులో లక్ష్మీస్ ఎన్టీఆరే ఆమెకు తొలిచిత్రం. నటనకు ఆమె పెట్టింది పేరు. లవ్ గురు అనే చిత్రానికిగాను ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి అవార్డు అందుకుంది. యజ్ఞాశెట్టి 2007లో ‘ఒండు ప్రీతియ కథే’ చిత్రంతో తెరంగేట్రం చేసింది.

Telugu news Ramgopal Varma finds his latest movie lakshmis NTR heroine for Lakshmiparvati character kannada actress Yagna Shetty