mictv telugu

రాంగోపాల్ వర్మ పాటల యుద్ధం…

January 11, 2019

మాటల యుద్దమే కాదు. ఇక నుండి పాటల యుద్దమూ జరుగుతుందని అనుకోవాలి. రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కోసం వెన్నుపోటు పాట రాయగా, అది సంచలనం అయింది.  బాబు టీం అండ్ వర్మల మధ్య ఇన్నాళ్లు మాటల యుద్దం సాగింది. సవాళ్లు, ప్రతిసవాళ్ల వరకు వెళ్లింది. కేసుల దాకా వెళ్లింది. తాజాగా వర్మకు కౌంటర్‌గా బాబును ఆకాశానికి ఎత్తేస్తూ వెన్నుపోటు కాదంటూ వర్మను ఏకిపారేస్తూ పాట రిలీజ్ చేశారు.

ఆ పాటలో రామారావు ఆశీసులు చంద్రబాబునాయుడిపై పుష్పలంగా ఉన్నాయంటూ సాగిందా పాట. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు  పొడవలేదని, అమరావతి కోసం ఏపీ సీఎం ఎంతో కష్టపడుతున్నారని రాశారు. ఇక్కడే బాబు టీం తప్పులో కాలేశారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

రాంగోపాల్  వర్మ సినిమాను చూసిన తర్వాత ప్రజలు బాబుకు ఓటేయకుండా మానరు. ఆయన వల్ల ఈయన ఓడిపోయేదీ ఏమీ లేదు. అయినా ఎందుకలా ఉలిక్కిపడ్డారో తెలియదు. వెంటనే కౌంటర్ సాంగ్ తయారు చేశారు. చంద్రబాబు గురించి రామారావు ఏమన్నారనే విషయం అందరికీ తెలిసిందే.  ఏ స్థాయిలో రామారావు ఆవేదన చెందారో యూట్యూబ్‌లో వీడియోలన్నీ ఉన్నాయి.

అయినప్పటికీ తాము ఉత్తములను చెప్పుకునే ప్రయత్నం  ఎందుకు చేశారో. కథానాయకుడు సినిమా విడుదల అయిన సందర్భంలోనే బాబుపై పాటను విడుదల చేశారు. రెండు ఒకేసారి వస్తే ప్రజల్లో తమకు మరింత ఇమేజ్ పెరుగుతుందనే ఆలోచనే  కావొచ్చు.Telugu news Ramgopal Varma song war..బాబు టీం  ఒక సాంగ్ విడుదల చేస్తే వర్మ మరో  సాంగ్ విడుదల చేస్తారు. అయినా వర్మకు కావాల్సింది మార్కెట్. బాబు టీం కూడా ఓట్ల మార్కెట్  కోసం తాపత్రాయ పడిందనే చర్చ జరుగుతోంది. నాటి కథానాయకుడు రామారావు సీఎం పదవి ఎలా పోయింది. అప్పట్లో మీడియాలో ఏం  రాశారు. తెలుగుదేశం పార్టీ ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొందనే విషయాల గురించి తెలుగు ప్రజలు ఇంకా మర్చిపోలేదు. మర్చిపోయే ఘటనలూ కావవి.

వర్మ సినిమా విడుదల చేస్తున్నానని,  తన సినిమాను అడ్డుకుంటామనే వాళ్లకూ సవాల్ విసిరారు. వర్మ గురించి తెలిసి కూడా ఆయనతో  పెట్టుకున్నారు. ఏపీలో మరికొందరు అంటున్న మాట గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుము కోవడం ఎందుకని. బాబుపై తీసిన సాంగ్  గురించి తెలుగు దేశం పార్టీలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

వర్మ సినిమా పాటకు భయపడే  తాము పోటీతో పాట చేయించామని ప్రజలు అనుకుంటారని, ఇది నష్టమే తప్ప దీని వల్ల ప్రయోజనం లేదని కొందరు నాయకులు అంటున్నారు.  చంద్రబాబుపై అటు పవన్, జగన్ విమర్శలు చేస్తున్నారు. మరోవైపు మోదీతో చెడింది. ఇక ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తీసిన రెండు సినిమాల్లో ఒకటి తనకు నష్టం కలిగించేలా ఉందని భావించినట్లుంది. అందుకోసమే ఎక్కడో ఒక దగ్గర  కౌంటర్ చేయకపోతే కష్టం అవుతుందని భావించే ఈ పాట చేయించారని టాక్ నడుస్తోంది.