టీవీ9 అబద్ధాల చానల్..  క్రిమినల్ కేసులు పెడతా.. వర్మ - MicTv.in - Telugu News
mictv telugu

టీవీ9 అబద్ధాల చానల్..  క్రిమినల్ కేసులు పెడతా.. వర్మ

February 20, 2018

తనను పొద్దస్తమానం చర్చలకు ఆహ్వానించి చిక్కుల్లో పడేసే టీవీ9 చానల్‌పై దర్శకుడు రాంగోపాల్ వర్మకు కోపమొచ్చింది. తన గురించి ఈ చానల్ తప్పుడు ప్రచారం చేస్తోందని, దాని యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెడతానని ఆయన మంగళవారం ట్విటర్లో తెలిపాడు.

ఫేస్ బుక్‌లోనూ దీనిపై స్పందించాడు.. రజనీకాంత్ సారథ్యంలో టీవీ9 వాస్తవాలను వక్రీకరించి, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోందని అన్నారు. దర్యాప్తు అంశాలను లీక్ చేస్తోందని, దీనిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.ఈ అంశంపై తన న్యాయవాదులతో చర్చిస్తున్నానని, క్రిమినల్ కేసు పెట్టేందుకు ఆ చానల్ ప్రసారం చేసిన వీడియో క్లిప్పులను సేకరిస్తున్నానని వెల్లడించారు.  గాడ్, సెక్స్, అండ్ ట్రూత్(జీఎస్టీ) సినిమాపై టీవీ9 చర్చ సందర్భంగా ఇద్దరు మహిళానేతలను అవమానించారన్న కేసులో రాంగోపాల్ వర్మను హైదరాబాద్ పోలీసులు విచారించడం తెలిసిందే. టీవీ9 ఈ విషయంలో తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని వర్మ ఆరోపించాడు.