2.0 ఆడియో వేడుకకు రాణా మాట - MicTv.in - Telugu News
mictv telugu

2.0 ఆడియో వేడుకకు రాణా మాట

October 26, 2017

2.0’ సినిమా ఆడియో వేడుక రేపు దుబాయ్‌లో బర్జ్ దుబాయ్ పార్క్ హోటల్లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఆడియో వేడుక తెలుగు వెర్షన్‌కు వ్యాఖ్యాతగా దగ్గుపాటి రాణా వ్యవహరిస్తున్నాడు.

రాణాకు జెమిని టీవీలో వస్తున్న ‘నంబర్ వన్ యారీ ’ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి తనకు యాంకరింగ్ చేయటం కొట్టిన పిండే. తమిళ ఆడియో కార్యక్రమానికి ఆర్జే బాలాజీ వ్యవహరిస్తున్నాడు.

అంతేకాదు 2.0లో ఒక పాటకి రెహ్మాన్‌ లైవ్‌ కంపోజ్ చేయనున్నారు. శంక‌ర్ ద‌ర్శక‌త్వంలో ర‌జ‌నీకాంత్‌, అమీ జాక్స‌న్‌, అక్ష‌య్ కుమార్‌లు న‌టించిన “2.0” చిత్ర ఆడియో వేడుకను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించే ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. రేపు దుబాయ్‌లోని బుర్జ్‌ దుబాయ్‌ పార్క్ హోటల్‌లో జ‌ర‌గ‌నుంది. దీనికి  హాజరు కావాలంటే వేలు, లక్షలు పోసి టికెట్ కొనాలి.