‘హిరణ్యకశిప’కు రానా సై - MicTv.in - Telugu News
mictv telugu

‘హిరణ్యకశిప’కు రానా సై

November 1, 2017

బాహుబలి’లో భల్లాలదేవగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రానా, ఇప్పుడు గుణశేఖర్ తీయబోయే పౌరాణిక సినిమా ‘హిరణ్యకశిప లో నటించడానికి ఓకే చెప్పాడు. ఇప్పటికే గుణశేఖర్ తీసిన ‘రుద్రమదేవి’ సినిమాలో వీరభద్రునిగా రాణా ఆకట్టుకున్నాడు.

తాజాగా తీస్తున్న ‘హిరణ్యకశిప’ సినిమాకు దాదాపు100 కోట్ల ఖర్చు అవుతుందని గుణశేఖర్ అంచనా వేశాడట. హిరణ్యకశిప పాత్రకు రాణా అయితే న్యాయం చేస్తాడని పట్టుబట్టి ఆయన్ను ఒప్పించాడు గుణశేఖర్. ఈ సినిమాను  రానా తండ్రి సురేష్  స్వంత బ్యానర్‌లో తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సురేశ్‌బాబు  గుణశేఖర్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.